నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం.. ప్రహరీ గోడ కూలి నలుగురు కార్మికులు మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ధాటికి ఓ కోళ్ల ఫామ్ ప్రహరీ గోడ కూలి అందులో పని

Update: 2024-05-26 12:47 GMT

దిశ, నాగర్ కర్నూల్/తాడూర్: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఆకారణంగా కురిసిన వర్షానికి రేకుల షెడ్డు కూలి ముగ్గురు మృతి చెంది ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన తాడూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన బెల్లె మల్లేష్ (35) తాడూర్ గ్రామ శివారులో రేకులు షెడ్డు నిర్మిస్తున్నాడు. నిర్మాణానికి తన భార్య పిల్లలతో పాటు ఇద్దరు అడ్డా కూలీలను తీసుకొనివెళ్ళాడు. ఆదివారం అకాల వర్షం కురవడంతో రేకుల షెడ్డు కింద కూర్చున్నారు.

ఈ క్రమంలో గోడ కూలీ బెల్లె మల్లేష్ (45 ) బెల్లె అనుష (14) చెన్నమ్మ రాములు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరిని హైదరాబాద్ చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కనురెప్ప పాటులో జరిగిన ఈ సంఘటనతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాలను నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి మార్చురికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నారు.

Similar News