రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు దుర్మరణం

ఆర్టీసీ, బస్సు ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Update: 2024-05-24 02:52 GMT

దిశ, ఆమనగల్లు: ఆర్టీసీ, బస్సు ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు అతివేగంతో వస్తున్న కారు రాంనుంతల శివారులోకి రాగానే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుకున్న మృతదేహలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Similar News