ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో హృదయం కలచివేసే ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-05-26 02:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో హృదయం కలచివేసే ఘటన చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు అందించారు. కానీ, అప్పటికే ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేసి మంటల్లో చిక్కుకున్న 11 మంది నవజాత శిశువులను కాపాడారు.

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సమాచారం మేరకు శనివారం రాత్రి 11.30 గంటలకు న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రి పక్కనే ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేసేందుకు 9 ఫైరింజన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని డీఎఫ్ చీఫ్ అతుల్ గార్గ్ ధృవీకరించారు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణం ఇంకా తెలియలేదని అన్నారు. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్‌లో రక్షించబడిన 11 నవజాత శిశువులను మెరుగైన చికిత్స కోసం తూర్పు ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసీయూ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News