Breaking: బోయిన్‌పల్లిలో లిక్కర్ తరలిస్తున్న ట్రక్కు బోల్తా.. ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాహా

మద్యం తరలిస్తున్న ట్రక్కు టైరు పేలి బోల్తా పడిన ఘటన సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-05-22 13:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: మద్యం తరలిస్తున్న ట్రక్కు టైరు పేలి బోల్తా పడిన ఘటన సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుచిత్ర నుంచి బోయిన్‌పల్లి వైపు మద్యాన్ని ఓ ట్రక్కులో తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రక్కు ముందు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో ట్రక్కు బోల్తాపడి మందు బాటిళ్లు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో రూ.3 లక్షల మద్యం సీసాలు ధ్వంసం కాగా, డ్రైవర్‌‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, కింద పడిన బాటిళ్లలో.. మరీ చీప్ లిక్కర్ తీసుకెళ్తే కిక్కేముందని అనుకున్నారో ఏమో.. ఖరీదైన మద్యం బాటిళ్లను మాత్రమే స్థానికులు మడత బెట్టినట్లుగా తెలుస్తోంది.  

Tags:    

Similar News