వనపర్తిలో దారుణం.. బీఆర్ఎస్ నేతను నరికి చంపిన దుండగులు

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి (53) దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2024-05-23 02:09 GMT

దిశ, చిన్నంబావి/ వీపనగండ్ల: కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి (53) దారుణ హత్యకు గురయ్యాడు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం మిరపకాయల కళ్ళం వద్ద నిద్రించిన శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో గొడ్డళ్లతో నరికి చంపారు. గురువారం ఉదయం చుట్టుపక్కల వారు విషయం తెలుసుకున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హత్య రాజకీయంగా జరిగిందా..!? భూతగాదాలతో జరిగిందా లేక.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..!? అన్న అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అవివాహితుడు అయిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హత్యకు గురికావడం సంచలనంగా మారింది.

Similar News