మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి

నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-05-25 05:16 GMT

దిశ,శేరిలింగంపల్లి: నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మణికొండ పంచవటి కాలనీలో నివాసం ఉంటున్న తేజస్విని(29) గత రాత్రి 8 గంటల సమయంలో ఇంటి వద్ద నడుచుకుంటూ వెళుతున్న తేజస్విని మెడలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రెండు తులాల బంగారు గొలుసు లాక్కుని పరుగు తీశాడు. దీంతో బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News