ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు మృతి

ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామశివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2023-02-12 04:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామశివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లీలా నగర్ క్రాస్ వద్ద ఓ లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, మృతులను నిస్సన్నపేటకు చెందిన గుప్తా లాలు, సునీతగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, తెనాలిలో ఓ పెళ్లి్కి హాజరై తిరిగి వస్తుండగా వీరి కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News