TSPSC పేపర్ లీక్: ఆ ఆశ చూపే మహిళలను లొంగదీసుకున్న ప్రవీణ్..!

టీఎస్పీఎస్ ఉద్యోగి ప్రవీణ్ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Update: 2023-03-14 06:31 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: టీఎస్పీఎస్ ప్రశ్నపత్రాల లికేజీ కేసు ప్రధాన నిందితుడు ప్రవీణ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అతను పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకున్నట్టు తాజాగా వెళ్లడయ్యింది. 2017లో ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్ గా టీఎస్పీఎస్ బోర్డులో ఉద్యోగంలో చేరాడు. మొదటి నాలుగేళ్లు వెరిఫికేషన్ సెక్షన్ లో పని చేశాడు.

ఆ సమయంలోనే దరఖాస్తుల్లో సాంకేతిక పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన పలువురు మహిళలకు సాయపడి వారి ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. ఆ తరువాత వారితో సంబంధాలు కొనసాగించాడు. ఈ క్రమంలోనే పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. ప్రవీణ్ మొబైల్ ఫోన్ ను విశ్లేశించినపుడు న్యూడ్ ఫొటోలు, వీడియోలతో పాటు అభ్యంతరకర చాటింగ్ లు బయట పడ్డాయి.

Also Read: TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్..?

Tags:    

Similar News