HYD: మాదాపూర్‌లో కాల్పులు కలకలం

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఏరియాలో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. సంజీవ రెడ్డి అనే రియల్టర్ తుపాకీతో రాత్రి పది గంటలు దాటిన తర్వాత హల్‌చల్ చేశారు.

Update: 2022-10-20 17:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఏరియాలో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. సంజీవ రెడ్డి అనే రియల్టర్ తుపాకీతో రాత్రి పది గంటలు దాటిన తర్వాత హల్‌చల్ చేశారు. ప్రముఖ వ్యక్తికి సంబంధించిన ప్లాట్ విషయంలో సంజీవ రెడ్డి తుపాకీతో కొందరిని భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు. తీవ్ర వాగ్వాదం అనంతరం సంజీవరెడ్డి గన్‌తో కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టించాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News