తెల్దారుపల్లిలో 144 సెక్షన్.. రంగంలోకి సీపీ విష్ణువారియర్

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య హత్య కలకలం రేపింది.

Update: 2022-08-15 13:31 GMT

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య హత్య కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆగష్టు 16వ తేదీ సాయంత్రం 6:00 గంటల వరకు 144 సెక్షన్ ఆంక్షలు అమలుల్లో ఉన్నందున ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని, గుంపులుగా తిరగడం నిషేధమని తెలిపారు. నిషేధం ఉన్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. గ్రామంలో ఇప్పటికే అధికారుల పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్య కేసులోని దుండగుల కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలింపు చేపట్టినట్లు తెలిపారు. నిందితులను పట్టుకొని చట్టం ముందు నిలబెడుతామని, క్షేత్రస్ధాయిలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

Tags:    

Similar News