తెలంగాణ టు ఆంధ్ర.. లారీలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ప్రభుత్వం అందిస్తున్న రాయితీ రేషన్‌ బియ్యం అక్రమ - Ration rice being transported in a heavy lorry was seized in Aswaraopet

Update: 2022-09-25 14:55 GMT

దిశ, అశ్వారావుపేట: ప్రభుత్వం అందిస్తున్న రాయితీ రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వద్ద గడిచిన మూడు రోజుల వ్యవధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడుతుంది. ఆదివారం స్థానిక విజిలెన్స్ పోలీసుల సంయుక్త దాడిలో కరీంనగర్, నల్గొండ జిల్లాల నుండి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి, కాకినాడ లకు రేషన్ బియ్యం తో వెళ్తున్న రెండు లారీలను పట్టుకున్నారు. ఈ రెండు లారీల్లో కలిపి సుమారు 500 క్వింటాళ్ల బియ్యం ఉండగా.. స్థానిక తహశీల్దార్ చల్లా ప్రసాద్ పంచనామా నిర్వహించారు.

పట్టుబడిన లారీలు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇదే విధంగా శనివారం రాత్రి రెండు లారీలు పట్టుబడ్డాయి. 24 గంటల వ్యవధిలో నాలుగు లారీలలో 1250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటంతో రేషన్ బియ్యం దందా ఎంత పెద్ద ఎత్తున నడుస్తుందో అర్థమవుతుంది.

Similar News