వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని నారాయణపూర్ గ్రామంలో వెలుగు చూసింది.

Update: 2022-10-14 15:12 GMT

దిశ, చెన్నూర్ : వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని నారాయణపూర్ గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపూర్ కు చెందిన మారుపాక రాకేష్ అనేవ్యక్తి అదే గ్రామానికి చెందిన ప్రవళికను ప్రేమించి ఇరువురి కుటుంబాల సమక్షంలో గత సంవత్సరం వివాహమాడాడు. వీరికి మూడునెలల క్రితం ఆడపాప కూడా పుట్టింది. వీరికి ఆడపాప పుట్టడమే ఆమె జీవితంలో శాపంగా మారింది.

ఆడ పాపకు జన్మనిచ్చినప్పటినుండి అత్తమామలు ఆడపడుచు సూటి సూటిపోటి మాటలతో తరచు వేధిస్తుండడంతో వారి మాటలువిని భర్త కట్నం తీసుకురావాలని తరచూ వేధించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఈనెల 12 తారీఖున పురుగుల మందు సేవించడంతో హుటా హుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రవళిక మృతి చెందింది. మృతురాలు తల్లి నిట్టూరి చిలకమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News