పింఛన్‌కోసం ఏపీకి వచ్చి ఒడిశా ప్రమాదంలో మృత్యుఒడికి..

ఒడిశా‌లో జరిగిన రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా జగన్నాథ పురానికి చెందిన వలస మత్స్యకారుడు మృతి చెందారు.

Update: 2023-06-04 06:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఒడిశా‌లో జరిగిన రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా జగన్నాథ పురానికి చెందిన వలస మత్స్యకారుడు మృతి చెందారు. జగన్నాథపురానికి చెందిన చోడిపల్లి గురుమూర్తి(63)ఉపాధి నిమిత్తం ఒడిశాలోని బాలేశ్వర్‌కు వలస వెళ్లారు. అయితే ప్రతి నెలా వృద్ధాప్య పింఛను కోసం జగన్నాథ పురానికి వచ్చి వెళ్తుంటాడు. అయితే పింఛను తీసుకుని ఈ నెల2న కోటబొమ్మాళి రైల్వేస్టేషన్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి భువనేశ్వర్‌లో దిగారు. అక్కడ నుంచి బాలేశ్వర్‌కు కోరమండల్ రైలు ఎక్కినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ కోరమండల్ రైలు ప్రమాదానికి గురి కావడంతో గురుమూర్తి మృతి చెందారు. గురుమూర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇకపోతే గురుమూర్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. మరోవైపు ఇదే రైలులో ప్రయాణిస్తున్న సంతబొమ్మాళి మండలానికి చెందిన యల్లమ్మకు రెండు చేతులూ విరిగిపోగా జగన్నాథపురం గ్రామానికి చెందిన మైలపల్లి రాజేశ్వరి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Read More:   Coromandel Express: కోరమండల్ రైలు ప్రమాదంలో 12 మంది ఏపీ ప్రయాణికుల ఆచూకీ తెలియాల్సి ఉంది

Tags:    

Similar News