స్కూల్లో ప్రిన్సిపల్ డ్రైవర్ దారుణం.. బుద్ధిచెప్పిన విద్యార్థిని పేరెంట్స్

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్‌కేజీ విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.

Update: 2022-10-18 13:07 GMT

దిశ, ఖైరతాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. LKG చదువుకునే చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ రజినికుమర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా డ్రైవర్ చిన్నారిని వేధిస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆ డ్రైవర్ రజినికుమార్‌ను స్కూల్లోనే చితకబాది బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు పొక్సో ఆక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News