మల్కాన్ గిరి సెక్టార్‌లో ఐఈడీ బాంబు స్వాధీనం

పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును మల్కాన్ గిరి సెక్టార్ లో బీఎస్ఎఫ్ పోలీసులు నిర్వీర్యం చేశారు.

Update: 2023-05-15 07:26 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును మల్కాన్ గిరి సెక్టార్ లో బీఎస్ఎఫ్ పోలీసులు నిర్వీర్యం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పక్కాగా అందిన సమాచారం మేరకు 142 బెటాలియన్ బిఎస్ఎఫ్ బృందం మల్కాన్ గిరి జిల్లా జీపీతెలరై పోలీస్ స్టేషన్ పరిధిలోని సుధాకొంత-అమపాదర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో బెజంగివాడా వెళ్లే దారిలోని ఓ కల్వర్ట్ సమీపంలోని చెట్టు కింద మావోయిస్టులు అమర్చిన ఐఈడీ కంటపడింది.

వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది దానిని నిర్వీర్యం చేశారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేదని అధికారులు తెలిపారు. మావోయిస్టుల సానుభూతిపరులు కూడా ఎక్కువే అని చెప్పారు. వీళ్లే పోలీసులు వెళ్లే దారుల్లో ఐఈడీలు అమర్చారని తెలిపారు. నిర్వీర్యం చేసిన ఐఈడీ బాంబును స్టీల్ టిఫిన్ బాక్స్ లో మూడు కిలోల పేలుడు పదార్థాలతో చేసి ఒక ఎలక్ట్రిక్ డిటోనేటర్ అమర్చినట్టు చెప్పారు. ఇరవై ఫీట్ల దూరం వరకు ఎలక్ట్రిక్ వైర్ ఏర్పాటు చేశారని తెలిపారు.

Tags:    

Similar News