తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్ గఢ్‌ దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది.

Update: 2023-02-25 06:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్‌ దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. శనివారం ఉదయం నుండి ఛత్తీస్ గఢ్‌‌లోని సుక్మా జిల్లా కుందేడ్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతి చెందిన వారిని ఏఎస్ఐ రామ్ నాగ్, కానిస్టేబుళ్లు కుంజంమ్ జోగా, వంజం భీమాగా గుర్తించారు. కాల్పుల్లో గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులు, భద్రత దళాల మధ్య కుందేడ్ అడవుల్లో కాల్పులు ఇంకా జరుగుతునే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News