వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి..

వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలో జరిగింది.

Update: 2023-05-16 13:50 GMT

దిశ, రేవల్లి: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలో చీర్కపల్లి గ్రామానికి చెందిన జరిగబంకల బాలనాగయ్య (58) సోమవారం ఉపాధి హామీ కూలీ పనికి వెళ్లాడు. పని చేస్తున్న క్రమంలో ఆకస్మికంగా బాలనాగయ్యకు వాంతులు అయ్యాయి. దీంతో అందుబాటులో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ బాల నాగయ్యకు ఓఆర్ఎస్ నీళ్లలో కలిపి తాగించారు.

ఆ తర్వాత అతని ఆరోగ్యం నీరసంగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు. కాగా అదే రోజు రాత్రి 9 గంటలకు బాలనాగయ్య మరణించాడు. మృతుడికి భార్య నాగమ్మ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆకస్మికంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆర్థికంగా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరారు.

Tags:    

Similar News