మెట్ పల్లిలో చిన్నారి పై కుక్కల దాడి..

ఓ చిన్నారి పై కుక్కలు దాడికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గురువారం జరిగింది.

Update: 2023-06-01 12:17 GMT

దిశ, కోరుట్ల : ఓ చిన్నారి పై కుక్కలు దాడికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబధించిన పూర్తివివరాల్లోకెళితే మెట్ పల్లి పట్టణంలోని ఎస్సారెస్పి కెనాల్ కట్ట మజీద్ దగ్గర మాహామ్మద్ ఉమర్ (9) అనే బాలడు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో బాలుడి చేయ్యి, శరీరం పై పలు గాయలయ్యాయి. స్థానికులు బాలున్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, ఇప్పటి వరకు చాలా మంది పై కుక్కలు దాడికి పాల్పడ్డాయని స్థానికులు తెలిపారు.

Tags:    

Similar News