బీచ్‌లో నగ్నంగా యువతి మృతదేహం.. హత్యా?ఆత్మహత్యా?

విశాఖ వైఎంసీఏ సమీపంలోని బీచ్‌లో ఓ యువతి మృతదేహం కలకలం రేపుతోంది.

Update: 2023-04-26 07:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ వైఎంసీఏ సమీపంలోని బీచ్‌లో ఓ యువతి మృతదేహం కలకలం రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి వైఎంసీఏ మూడో పట్టణ పోలీసులు యువతి మృతదేహాన్ని గుర్తించారు. బీచ్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన యువతి మృతదేహంపై కనీసం బట్టలు కూడా లేకపోవడం సంచలనంగా మారింది. తొలత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో యువతి మృతదేహం పెద గంట్యాడకు చెందిన శ్వేతగా పోలీసులు గుర్తించారు. మృతురాలు 5 నెలల గర్భవతి అని నిర్ధారించారు. కుటుంబ కలహాలతో మృతురాలు ఆత్మహత్యకు పాల్పడిందా..? లేకపోతే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News