బ్రేకింగ్: వీడియో కోసం 300 km వేగంతో బైక్ నడిపి ప్రముఖ యూట్యూబర్ మృతి

యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది అనేక స్టంట్‌లు చేస్తుంటారు.

Update: 2023-05-04 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది అనేక స్టంట్‌లు చేస్తుంటారు. ఒక్కోసారి వారు చేసే విన్యాసాలకు ప్రాణాలు సైతం బలవుతాయి. తాజాగా UP అలీగఢ్ జిల్లాలో ఇలాంటి దారుణ సంఘటన జరిగింది. యూట్యూబ్ వీడియో కోసం అతివేగంతో బైక్ నడిపి ఓ యూట్యూబర్ మరణించాడు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌కు చెందిన అగస్త్య చౌహాన్ ‘PRO RIDER 1000’ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. బైక్ రేస్ వీడియోలు దీనిలో అప్‌లోడ్ చేస్తాడు. ఢిల్లీలో జరిగే టూవీలర్ లాంగ్ రైడ్ పోటీల్లో పాల్గోనేందుకు బైక్‌పై వెళ్తూ.. 300 km వేగంతో బైక్ నడపగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. UP అలీగఢ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

Read More:   ఇండియా మార్కెట్లోకి త్వరలో రాబోతున్న టాప్ కార్లు ఇవే!

Tags:    

Similar News