గంజాయితో పట్టుబడ్డ స్టార్ సింగర్..
దిశ, వెబ్‌డెస్క్: మత్తుపదార్థాలను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే..
దిశ, వెబ్‌డెస్క్: మత్తుపదార్థాలను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి వాటికి యువత దూరంగా ఉండాలంటూ అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతోంది. గంజాయి ఎవరి దగ్గర ఉన్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారిని అదుపులోకి తీసుకుంటుంది. తాజాగా ఇదే తరహాలో గంజాయితో ట్రావెల్ చేస్తున్న స్టార్ సింగర్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ పెడ్లర్‌గా మారిన బోజ్‌పురీ స్టార్ సింగర్ వినయ్ శర్మను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 21.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, దీని మూలాల ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే బీహార్ సింగర్ శర్మ తన కెరీర్లో దాదాపు 100 బోజ్‌పురీ పాటలు పాడాడు. అక్కడ అతడి పాటలకు మంచి క్రేజ్ కూడా ఉంది.