ట్రైన్‌లో కొడుకు ముందే మహిళపై హత్యాచారయత్నం.. సహకరించలేదని..

దిశ, వెబ్‌డెస్క్: ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేశాడు.

Update: 2022-09-02 12:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేశాడు. దానిని ప్రతిఘటించడంతో కోపొద్రిక్తుడైన ఆ యువకుడు ఆమెను వెళుతున్న ట్రైన్ లోంచి కిందికి తోసేయడంతో ఆ మహిళ ప్రాణాలను కోల్పోయింది. ఈ దారుణ ఘటన హర్యానాలోని ఫతేబాద్ సమీపంలో తోహానీ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఓ 30 ఏళ్ల మహిళ, తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి గురువారం రాత్రి ట్రైన్‌ ఎక్కింది. వీరితో పాటు అదే బోగిలో సందీప్ (27) కూడా ప్రయాణించాడు. అదే అనువుగా భావించిన కామాంధుడు ఒంటరిగా ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో కోపానికి గురైన సందీప్.. ఆ మహిళను ట్రైన్‌‌లోంచి బయటకు తోసేశాడు. అనంతరం అతడు కూడా దూకేశాడు.Attempted rape on woman in front of son in train

 అయితే ఈ దారుణం మొత్తం చూసిన మహిళ కొడుకు ట్రైన్ ఆగిన వెంటనే పరుగు పరుగున వాళ్ల నాన్న దగ్గరకు చేరుకుని జరిగిన ఘోరాన్ని చెప్పాడు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్వాప్తు మొదలు పెట్టారు. జరిగిన ఘటనలో సదరు మహిళ మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన కామాంధుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News