సీఎం ఇంట్లోకి ఆయుధాలతో చొరబడేందుకు యత్నం

సీఎం ఇంట్లోకి ఆయుధాలతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2023-07-21 09:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం ఇంట్లోకి ఆయుధాలతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నివాసం వద్ద ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసు స్టిక్కర్ ఉన్న వాహనంతో మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు యత్నించగా అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే దుండగుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో సీఎం మమతాబెనర్జీ ఇంట్లోనే ఉన్నారు. నిందితుడి వద్ద చాకుతో పాటు గంజాయి లభ్యమైంది. నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more : disha newspaper

Tags:    

Similar News