ప్రమాదవశాత్తు జాలరి మృతి

ప్రమాదవశాత్తు జాలరి మృతిచెందిన ఘటన రాయికల్ మండల పరిధిలోని సింగారావుపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2023-05-14 14:37 GMT

దిశ, రాయికల్ : ప్రమాదవశాత్తు జాలరి మృతిచెందిన ఘటన రాయికల్ మండల పరిధిలోని సింగారావుపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రోడ్డ నడిపి భూమయ్య ఉదయం చేపలు పట్టేందుకు సమీపంలోని చింతల చెరువు వద్దకు వెళ్లాడు. గట్టుపై నుంచి నీటిలో వల వేసి చేపల కోసం ఎదురుచూస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో భూమయ్య తల వెనక భాగంలో తీవ్ర గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రొడ్డ లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News