పిడుగుపాటుకు మేకల కాపరి మృతి

మండల పరిధిలోని జగదేవ్ పేట గ్రామానికి చెందిన క్యాతం రాజయ్య (65) అనే మేకల కాపరి శనివారం పిడుగు పాటుతో మృతి చెందాడు.

Update: 2023-05-20 13:35 GMT

దిశ, వెల్గటూర్ : మండల పరిధిలోని జగదేవ్ పేట గ్రామానికి చెందిన క్యాతం రాజయ్య (65) అనే మేకల కాపరి శనివారం పిడుగు పాటుతో మృతి చెందాడు. మేకలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న రాజయ్య సాయంత్రం సమయంలో కురిసిన వర్షానికి తడవకుండా చెట్టు కిందకి వెళ్లాడు. దురదృష్టవశాత్తు అదే చెట్టుపై పిడుగు పడింది. చెట్టు పక్కనే ఉన్న రాజయ్య పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags:    

Similar News