పిడుగుపాటుకు ఎద్దు మృతి

పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడిన ఘటన ఓదెల మండల పరిధిలోని పోత్కపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2023-05-09 14:36 GMT

దిశ, ఓదెల: పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడిన ఘటన ఓదెల మండల పరిధిలోని పోత్కపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శనిగరపు శంకర్ అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద మేత కొసం ఎద్దులను గడ్డివాము వద్ద కట్టేశాడు. ఆ సమయంలో అక్కడ పిడుగు పడటంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. రైతు శంకర్ వ్యవసాయ మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. సుమారు రూ.70 వేల విలువ గల ఎద్దు మృతి చెందడంతో తాను జీవనోపాధి కోల్పోయానని రైతు శంకర్ బోరున విలిపించాడు. వ్యవసాయమే అధారంగా బ్రతుకుతున్న తనకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.

Tags:    

Similar News