మంత్రి ఈటలకు సీపీఎం నేతల వినతి

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 వైద్య సేవల్లో ప్రభుత్వం మాటలు, చేతలకు పొంతన లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ బృందం విమర్శించింది. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బి. వెంకట్, టి. జోత్యిలు బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటలను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కరోనా వైద్య సమస్యలపై చర్చించారు. బాధితులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని కోరారు. కరోనా వైద్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను […]

Update: 2020-07-21 10:09 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 వైద్య సేవల్లో ప్రభుత్వం మాటలు, చేతలకు పొంతన లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ బృందం విమర్శించింది. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బి. వెంకట్, టి. జోత్యిలు బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటలను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కరోనా వైద్య సమస్యలపై చర్చించారు. బాధితులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని కోరారు. కరోనా వైద్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కార్పొరేటు ఆస్పత్రులు బేఖాతరు చేస్తున్నాయని ‘ ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News