పీవీ ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు: చాడ
దిశ, న్యూస్‌బ్యూరో: పదవుల కోసం పాకులాడే వ్యక్తిగా కాకుండా వచ్చిన పదవులకు వన్నె తేవడమే ఆయన వ్యక్తిత్వమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కొనియాడారు. పీవీ శత జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం సీపీఐ ఆఫీస్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ మాట్లాడుతూ పీవీ శత జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం పట్ల తెలంగాణ ప్రజానీకం హర్షిస్తోందన్నారు. సాయుధ పోరాటంలో పీవీ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా నైజాంను గద్దె దించకపోతే […]
దిశ, న్యూస్‌బ్యూరో: పదవుల కోసం పాకులాడే వ్యక్తిగా కాకుండా వచ్చిన పదవులకు వన్నె తేవడమే ఆయన వ్యక్తిత్వమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కొనియాడారు. పీవీ శత జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం సీపీఐ ఆఫీస్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ మాట్లాడుతూ పీవీ శత జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం పట్ల తెలంగాణ ప్రజానీకం హర్షిస్తోందన్నారు. సాయుధ పోరాటంలో పీవీ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా నైజాంను గద్దె దించకపోతే ప్రజాస్వామ్య పాలన రాదని నమ్మేవారన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పదవులు అనుభవించారని గుర్తు చేశారు. పీవీ స్వయంగా భూస్వామి అయినప్పటికీ దున్నే వాడికే భూమి కావాలనే కమ్యూనిస్టుల పోరాటాల నేపథ్యంలో భూ సంస్కరణ చట్టాలు తెచ్చి బలహీన వర్గాలకు భూములు పంచే కార్యక్రమం చేపట్టారన్నారు.