ఈ నెల 28న సీపీఎం ధర్నా

దిశ, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంస్థ 2010వ సంవత్సరంలో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని.. సీపీఎం హైదరాబాద్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఉల్లంఘనను నిరసిస్తూ.. ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కన్వెషన్ అగ్రిమెంట్లను పక్కనపెట్టి.. అధిక ధరలు వసూలు చేస్తున్నారని.. ఈ విషయంపై ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారని శ్రీనివాస్ ప్రశ్నించారు. సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన మెట్రో ఛార్జీలను […]

Update: 2020-02-24 08:48 GMT

దిశ, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంస్థ 2010వ సంవత్సరంలో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని.. సీపీఎం హైదరాబాద్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఉల్లంఘనను నిరసిస్తూ.. ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కన్వెషన్ అగ్రిమెంట్లను పక్కనపెట్టి.. అధిక ధరలు వసూలు చేస్తున్నారని.. ఈ విషయంపై ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారని శ్రీనివాస్ ప్రశ్నించారు. సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన మెట్రో ఛార్జీలను పెంచడం దుర్మార్గమని విమర్శలు చేశారు.

Tags:    

Similar News