అచ్చెన్నాయుడి అరెస్టును ఖండిస్తున్నాం..

దిశ, వెబ్‌డెస్క్ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఈఎస్ స్కామ్ లో భాగంగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అయితే ఆయన అరెస్టును ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ మరో పార్టీని మనుగడ లేకుండా సమూలంగా నిర్మూలించాలని చూడటం సరికాదన్నారు. ఏదైనా ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలన్నారు.జగన్ ఇప్పటికైనా కక్ష్య పూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

Update: 2020-06-13 03:25 GMT

దిశ, వెబ్‌డెస్క్
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఈఎస్ స్కామ్ లో భాగంగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అయితే ఆయన అరెస్టును ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ మరో పార్టీని మనుగడ లేకుండా సమూలంగా నిర్మూలించాలని చూడటం సరికాదన్నారు. ఏదైనా ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలన్నారు.జగన్ ఇప్పటికైనా కక్ష్య పూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

Tags:    

Similar News