దారిదోపిడీ.. ఇద్దరు నేరస్థులపై పీడీ యాక్ట్

దిశ,వరంగల్: రహదారులపై వచ్చిపోయే వాహనదారులను ఆపి, వారిపై దాడులకు తెగబడ్డ నేరం కింద జెలులో శిక్ష అనుభవిస్తున్నఇద్దరిపై పీడీ యాక్టు నమోదైంది. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ అడెపు అనిల్, ఎస్.కె రబ్బానీలపై బుధవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసారు.ఈ మేరకు ఉత్తర్వుల కాపీని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి.నరేష్ కుమార్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న నేరస్థులకు జైలర్ సమక్షంలో అందజేశారు. నగరంలోని కరీమాబాద్‌కు చెందిన నిందితులిద్దరు ఉర్సుగుట్ట ప్రాంతంలో రహదారులపై వెళ్లే […]

Update: 2020-06-03 05:28 GMT

దిశ,వరంగల్: రహదారులపై వచ్చిపోయే వాహనదారులను ఆపి, వారిపై దాడులకు తెగబడ్డ నేరం కింద జెలులో శిక్ష అనుభవిస్తున్నఇద్దరిపై పీడీ యాక్టు నమోదైంది. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ అడెపు అనిల్, ఎస్.కె రబ్బానీలపై బుధవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసారు.ఈ మేరకు ఉత్తర్వుల కాపీని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి.నరేష్ కుమార్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న నేరస్థులకు జైలర్ సమక్షంలో అందజేశారు. నగరంలోని కరీమాబాద్‌కు చెందిన నిందితులిద్దరు ఉర్సుగుట్ట ప్రాంతంలో రహదారులపై వెళ్లే లారీలను ఆపి డ్రైవర్, క్లీనర్లను తీవ్రంగా కొట్టి డబ్బులతో పాటు రెండు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు.బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితులు తరచూ ఈ విధంగా దోపిడీలకు పాల్పడుతుండటంతో పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ సీపీ తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News