కనిపించని శత్రువుతో… పోలీసుల పోరాటం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సికింద్రాబాద్‌లో కరోన బారిన పడి, కోలుకున్న నార్త్ జోన్ పోలీసులను సీపీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే మొదటిసారి పోలీసులు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. అంతేగాకుండా అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పోలీసులు సేవలు అందించారని తెలిపారు. నక్సలైట్లు, రౌడీ షీటర్ల లాంటి విద్రోహ శక్తులతో పోరాటం చేశారని, కానీ, నేడు కనపడని శత్రువు […]

Update: 2020-08-06 10:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సికింద్రాబాద్‌లో కరోన బారిన పడి, కోలుకున్న నార్త్ జోన్ పోలీసులను సీపీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే మొదటిసారి పోలీసులు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు.

అంతేగాకుండా అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పోలీసులు సేవలు అందించారని తెలిపారు. నక్సలైట్లు, రౌడీ షీటర్ల లాంటి విద్రోహ శక్తులతో పోరాటం చేశారని, కానీ, నేడు కనపడని శత్రువు కరోనాతో పోరాటం చేసి ప్రజల ప్రాణాలను కాపాడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విధి నిర్వాహణలో కూడా నగర పోలీసులు చాలా సాహసోపేతంగా పని చేస్తున్నారన్నారు. ముఖ్యంగా నార్త్ జోన్ పోలీసులను సీపీ అభినందించారు.

Tags:    

Similar News