కృష్ణపట్నంలో ఆనందయ్య సోదరుడి అత్యుత్సాహం.. రెచ్చిపోయిన ప్రజలు

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నియంత్రణకు సోమవారం నుంచి మందు పంపిణీ చేయనున్నట్లు ఆనందయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, గుట్టుచప్పుడు కాకుండా ఆనందయ్య సోదరుడు ఆదివారం మందు పంపిణీ చేయడంతో చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున కృష్ణపట్నానికి తరలివచ్చారు. మందు కోసం ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రజలు మందు కోసం ఎగబడ్డారు. అక్కడున్న పోలీసులు కూడా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేకపోయారు. దీంతో కరోనా రక్కసి […]

Update: 2021-06-06 02:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నియంత్రణకు సోమవారం నుంచి మందు పంపిణీ చేయనున్నట్లు ఆనందయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, గుట్టుచప్పుడు కాకుండా ఆనందయ్య సోదరుడు ఆదివారం మందు పంపిణీ చేయడంతో చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున కృష్ణపట్నానికి తరలివచ్చారు.

మందు కోసం ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రజలు మందు కోసం ఎగబడ్డారు. అక్కడున్న పోలీసులు కూడా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేకపోయారు. దీంతో కరోనా రక్కసి మళ్లీ తన ప్రతాపాన్ని చూపే అవకాశం లేకపోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News