ఏంటీ వేధింపులు… ఒకవైపు కరోనా.. ఇంకోవైపు వర్షాలు

పులి మీద పుట్రలా దక్షిణాది రాష్ట్రాలను ఒకవైపు కరోనా మరోవైపు వర్షాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కట్టడి చేస్తామన్న ప్రభుత్వం చేష్టలుడిగింది. నిన్న మొన్నటి వరకు పారేసుకున్న కోళ్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరింగింది. ఈ నేపథ్యం వర్షాలు కురుస్తాయన్న వార్త ఇబ్బందిగా పరిణమించింది. దక్షిణాదిపై ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని కారణంగా, నేడు, రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు […]

Update: 2020-03-23 06:35 GMT

పులి మీద పుట్రలా దక్షిణాది రాష్ట్రాలను ఒకవైపు కరోనా మరోవైపు వర్షాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కట్టడి చేస్తామన్న ప్రభుత్వం చేష్టలుడిగింది. నిన్న మొన్నటి వరకు పారేసుకున్న కోళ్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరింగింది. ఈ నేపథ్యం వర్షాలు కురుస్తాయన్న వార్త ఇబ్బందిగా పరిణమించింది.

దక్షిణాదిపై ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని కారణంగా, నేడు, రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తెలంగాణ నుంచి ఉత్తర కేరళ వరకూ.. అలాగే రాయలసీమ నుంచి కర్ణాటక వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని కారణంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ద్రోణికి అనుబంధంగా కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. వీటి ప్రభావంతో నేడు, రేపు కూడా వర్షాలు కురుస్తాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తుందని వారు తెలిపారు.

Tags: corona, rains, wether, south india, ap, telangana, kerala, karnataka, tamilnadu

Tags:    

Similar News