ఐసోలేషన్ లోకి గవర్నర్
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా తమిళనాడులో రాజ్ భవన్‌లో ముగ్గురికి ముగ్గురికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. వైద్యుల సూచన మేరకు ఆయన ఏడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. గవర్నర్ ఆరోగ్యంగానే ఉన్నారని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారని […]
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా తమిళనాడులో రాజ్ భవన్‌లో ముగ్గురికి ముగ్గురికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. వైద్యుల సూచన మేరకు ఆయన ఏడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. గవర్నర్ ఆరోగ్యంగానే ఉన్నారని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారని చెప్పారు.
ఇటీవల రాజ్‌భవన్‌లో పనిచేసే 84 మంది భద్రతా, ఫైర్ సిబ్బంది కొవిడ్ బారినపడ్డారు. అయితే, వారిలో ఏ ఒక్కరూ గవర్నర్‌తో గానీ, సీనియర్ అధికారులతోగానీ కాంటాక్ట్ కాలేదని గురువారం రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే తాజాగా మరో 38 మందికి పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.