రాష్ట్రంలో కరోనా విజృంభణ.. @209
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 209 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం. ఈ నెల 6న జీహెచ్ఎంసీ పరిధిలో 152 మందితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 206 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్థాయి కేసుల నమోదు కాగా.. ఈ అంకెలను మించి గురువారం అత్యధిక స్థాయిలో కొత్త పాజిటివ్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 209 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం. ఈ నెల 6న జీహెచ్ఎంసీ పరిధిలో 152 మందితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 206 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్థాయి కేసుల నమోదు కాగా.. ఈ అంకెలను మించి గురువారం అత్యధిక స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక ఎస్ఐతో పాటు మరో ఏడుగురు పోలీసులకు పాజిటివ్ నమోదైంది. ఇంకా కొద్దిమంది పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. తాజా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో 208, వలస ప్రజల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 4,320కి చేరుకున్నారు. గురువారం తొమ్మిదిమంది మృతిచెందగా.. ఇప్పటివరకూ కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 165కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో 175 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మేడ్చల్‌లో 10, రంగారెడ్డిలో 7, కరీంనగర్, మహబూబ్‌నగర్ -3, వరంగల్ అర్భన్, అసిఫాబాద్ జిల్లాల్లో-2, సిరిసిల్లా, కామారెడ్డి, వరంగల్ రూరల్, ములుగు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా చికిత్స పొందుతున్న వారు 2,162 మంది ఉండగా.. 1,993 మంది డిశ్చార్జి అయినట్టు హెల్త్ బులిటెన్ తెలిపింది.