కర్నూలులో కరోనా కలవరం

అమరావతి: ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో కొత్తగా 67 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించగా, వాటిలో అత్యధికంగా 25 కేసులు ఒక్క కర్నూలులోనే వెలుగు చూశాయి. పాజిటివ్ కేసులు ప్రధానంగా కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, కోడుమూరు నందికొట్కూరు ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు […]

Update: 2020-05-04 02:25 GMT

అమరావతి: ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో కొత్తగా 67 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించగా, వాటిలో అత్యధికంగా 25 కేసులు ఒక్క కర్నూలులోనే వెలుగు చూశాయి. పాజిటివ్ కేసులు ప్రధానంగా కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, కోడుమూరు నందికొట్కూరు ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం.

ఇదిలా ఉండగా, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు నర్సులకూ కరోనా సోకింది. అటు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లోనూ 8 మంది వైరస్ బారినపడ్డారు. తాజాగా నమోదైన కేసులు కలుపుకుంటే కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 491కు చేరి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (338), కృష్ణా (278), నెల్లూరు (91), కడప (87) జిల్లాలున్నాయి.

Tags: kurnool, ap, top place, 466 positive cases, nandyal

Tags:    

Similar News