పోలీసుల కళ్ళు గప్పి భూంపల్లి చెరువుకు కాంగ్రెస్ నేతలు

దిశ, నిజామాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గోదావరి నదిపై ప్రాజెక్టుల సందర్శనకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి సుభాష్‌రెడ్డి మాత్రం పోలీసుల కళ్లుగప్పి భూంపల్లి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులను సందర్శిస్తే ప్రభుత్వం అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తే లోపాలు బయట పడుతాయనే భయంతోనే ప్రభుత్వం అరెస్ట్‌లు చేయిస్తుందన్నారు. […]

Update: 2020-06-13 03:57 GMT

దిశ, నిజామాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గోదావరి నదిపై ప్రాజెక్టుల సందర్శనకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి సుభాష్‌రెడ్డి మాత్రం పోలీసుల కళ్లుగప్పి భూంపల్లి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులను సందర్శిస్తే ప్రభుత్వం అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తే లోపాలు బయట పడుతాయనే భయంతోనే ప్రభుత్వం అరెస్ట్‌లు చేయిస్తుందన్నారు. ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు ఖర్చు చేస్తూ కోటి ఎకరాలకు నీరందిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతుందన్నారు.

Tags:    

Similar News