రేపు రాజ్‌భవన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం అన్ని రాష్ట్రాల్లోని రాజ్‌భవన్‌ల ఎదుట నిరసన వ్యక్తం చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. రాజ్యాంగాన్ని కాపాడండి’’ అనే నినాదంతో సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో రాజభవన్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో నేతలు సమావేశమై రాజభవన్‌కు బయలుదేరానున్నారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు […]

Update: 2020-07-26 11:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం అన్ని రాష్ట్రాల్లోని రాజ్‌భవన్‌ల ఎదుట నిరసన వ్యక్తం చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. రాజ్యాంగాన్ని కాపాడండి’’ అనే నినాదంతో సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో రాజభవన్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో నేతలు సమావేశమై రాజభవన్‌కు బయలుదేరానున్నారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News