సర్కారుకు సొంతపార్టీ నేత అల్టిమేటం

మధ్యప్రదేశ్‌లో అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంతపార్టీ నేతనే పక్కలో బల్లెంలా తయారయ్యాడు. అధికారంలోకి రాకముందు పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ నెరవేర్చాలని సర్కారుకు అల్టీమేటం జారీ చేశాడు. లేదంటే రోడ్లనెక్కి ఆందోళనలు చేస్తాననీ హెచ్చరించాడు. కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా ఇలా హెచ్చరించడం ఇది రెండోసారి. తాను ప్రజా సేవకుడినని, ప్రజా సమస్యలపై పోరాడటమే తన అభిమతమని అన్నాడు. సహనం పాటించాల్సిన అవసరం ఉంది కానీ, ఒకవేళ హామీలను అమలు చేయకుంటే మాత్రం ఆందోళనలు చేయడం ఖాయమని […]

Update: 2020-02-17 05:15 GMT

మధ్యప్రదేశ్‌లో అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంతపార్టీ నేతనే పక్కలో బల్లెంలా తయారయ్యాడు. అధికారంలోకి రాకముందు పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ నెరవేర్చాలని సర్కారుకు అల్టీమేటం జారీ చేశాడు. లేదంటే రోడ్లనెక్కి ఆందోళనలు చేస్తాననీ హెచ్చరించాడు. కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా ఇలా హెచ్చరించడం ఇది రెండోసారి. తాను ప్రజా సేవకుడినని, ప్రజా సమస్యలపై పోరాడటమే తన అభిమతమని అన్నాడు. సహనం పాటించాల్సిన అవసరం ఉంది కానీ, ఒకవేళ హామీలను అమలు చేయకుంటే మాత్రం ఆందోళనలు చేయడం ఖాయమని అన్నాడు. 2019 జనరల్ ఎన్నికల్లో గుణశివపురి నుంచి పోటీ చేసి సింధియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గతంలోనూ ఇలాగే హెచ్చరిస్తే.. చేస్తే చేసుకోని అన్నట్టుగా మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మాట్లాడారు. ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్ల కాలంలో పూర్తిచేస్తామని అన్నారు.

Tags:    

Similar News