‘ప్రభుత్వం గిరిజనులను మోసం చేసింది’

దిశ హాలియా: గిరిజనులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవూర్ మండలంలోని సాగర్ ప్రధాన రహదారి పక్కన వెలసిన తుమ్మ చెట్టు ముత్యాలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరకు జానారెడ్డి సతీసమేతంగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమన్నారు. 2018 ఎన్నికల్లో గిరిజనులకు 10%శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి తప్పిన వ్యక్తి కేసీఆర్ […]

Update: 2021-02-23 08:39 GMT

దిశ హాలియా: గిరిజనులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవూర్ మండలంలోని సాగర్ ప్రధాన రహదారి పక్కన వెలసిన తుమ్మ చెట్టు ముత్యాలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరకు జానారెడ్డి సతీసమేతంగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమన్నారు. 2018 ఎన్నికల్లో గిరిజనులకు 10%శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి తప్పిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. గిరిజనులకే కాక బడుగు, బలహీన వర్గాలకు కూడా అనేక హామీలు ఇచ్చి ఎన్నికలు కాగానే వాటిని విస్మరించారని మండిపడ్డారు. హామీలు నెరవేరాలంటే రాబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News