ఆ పార్టీలు మమతకు మద్దతు ఇవ్వాలి: సౌగతారాయ్

కోల్‌కతా: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు నిజంగా బీజేపీకి వ్యతిరేకమైతే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతు పలకాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ కోరారు. కాషాయ పార్టీ మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పోరుడుతున్నారని తెలిపారు. త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీ సౌగతా రాయ్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక రాజకీయాల ముఖచిత్రంగా మమతా బెనర్జీ నిలిచారని, కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు […]

Update: 2021-01-13 09:50 GMT

కోల్‌కతా: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు నిజంగా బీజేపీకి వ్యతిరేకమైతే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతు పలకాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ కోరారు. కాషాయ పార్టీ మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పోరుడుతున్నారని తెలిపారు. త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీ సౌగతా రాయ్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక రాజకీయాల ముఖచిత్రంగా మమతా బెనర్జీ నిలిచారని, కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి మద్దతుగా నిలువాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క విజయవంతమైన పథకం కూడా ప్రారంభించలేదని ఆరోపించారు.

Tags:    

Similar News