రోడ్డుకు అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి రైతుల ఆందోళన

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడెక్కారు. ధాన్యం తరలింపునకు లారీలను రప్పించి మిల్లులకు తరలించాలని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో రైతులు ఆందోళనకు దిగారు. వడ్ల బస్తాలు జాతీయ రహదారిపై అడ్డంగా వేసి రాస్తారోకో చేసి గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షం వల్ల.. అపార నష్టం వాటిల్లిందని రైతులు […]

Update: 2021-06-03 05:18 GMT

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడెక్కారు. ధాన్యం తరలింపునకు లారీలను రప్పించి మిల్లులకు తరలించాలని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో రైతులు ఆందోళనకు దిగారు. వడ్ల బస్తాలు జాతీయ రహదారిపై అడ్డంగా వేసి రాస్తారోకో చేసి గురువారం నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షం వల్ల.. అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అధికారులు సకాలంలో లారీలను పంపి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, రైతులకు నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను విరమించారు.

 

Tags:    

Similar News