ఖ‌మ్మం ఆస్ప‌త్రిలో జీతాల కోసం ఆందోళ‌న

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఖ‌మ్మం ఆస్ప‌త్రిలో విధులు నిర్వ‌హిస్తున్న సాయి సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది శ‌నివారం ఆందోళ‌న‌కు దిగారు. జీతాలు రాక కుటుంబాల‌ను పోషించుకోలేక‌పోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్‌ను క‌లిసి విన్న‌విస్తే త‌మ‌కు సంబంధంలేద‌ని చెబుతున్నార‌ని వాపోయారు. ప్ర‌భుత్వం స్పందించి త‌మ‌కు జీతాలు అందేలా చూడాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తమకు యూనిఫాం, గ్లౌజులు తదితర వస్తువులు ఇవ్వడంలేదని, అయినా కూడా తాము ఇంత‌టి భ‌యాన‌క ప‌రిస్థితుల్లో […]

Update: 2020-08-08 02:10 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఖ‌మ్మం ఆస్ప‌త్రిలో విధులు నిర్వ‌హిస్తున్న సాయి సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది శ‌నివారం ఆందోళ‌న‌కు దిగారు. జీతాలు రాక కుటుంబాల‌ను పోషించుకోలేక‌పోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్‌ను క‌లిసి విన్న‌విస్తే త‌మ‌కు సంబంధంలేద‌ని చెబుతున్నార‌ని వాపోయారు. ప్ర‌భుత్వం స్పందించి త‌మ‌కు జీతాలు అందేలా చూడాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తమకు యూనిఫాం, గ్లౌజులు తదితర వస్తువులు ఇవ్వడంలేదని, అయినా కూడా తాము ఇంత‌టి భ‌యాన‌క ప‌రిస్థితుల్లో విధులు నిర్వ‌హిస్తున్న త‌మ‌ను ఏజెన్సీ నిర్వాహకులుగానీ, ప్ర‌భుత్వం గానీ ప‌ట్టించుకోక‌పోవ‌డం అమానుష‌మ‌న్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News