Andhra Pradesh: సర్వేలో సంచలనాలు.. ఏపీలో సంపూర్ణ లాక్‌డౌన్..?
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారడంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఫీవర్ సర్వేలో సంచలన విషయాలు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో పాజిటివిటి రేటు 20 శాతం దాటిందని.. ప్రస్తుత ఆంక్షల వల్ల ఎటువంటి లాభం లేదని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అందుకే లాక్‌డౌన్ మినహాయింపును 3 నుంచి 4 గంటల వరకు కుదించే అవకాశం ఉన్నట్టు […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారడంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఫీవర్ సర్వేలో సంచలన విషయాలు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో పాజిటివిటి రేటు 20 శాతం దాటిందని.. ప్రస్తుత ఆంక్షల వల్ల ఎటువంటి లాభం లేదని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అందుకే లాక్‌డౌన్ మినహాయింపును 3 నుంచి 4 గంటల వరకు కుదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మినహాయింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ లాక్‌డౌన్‌పై రేపటి వరకు ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.