'అవ్వి కోలుకునేందుకు మరింత సమయం'!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కమర్షియల్ వెహికల్ అమ్మకాలు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సోమవారం తెలిపింది. ఈ-కామర్స్ కార్యకలాపాలు పెరగడంతో లైట్-కమర్షియల్ వాహనాల విభాగం ఇటీవల కోలుకుంటున్న సంకేతాలను చూపిస్తున్నాయి. అదేవిధంగా మీడియం, హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు 2021-22 చివరి త్రైమాసికం వరకు కోలుకునే అవకాశాలు కనిపించడంలేదని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. లైట్-కమర్షియల్ వాహనాల అమ్మకాలు 20-25 శాతం తగ్గుతాయని, మీడియం-కమర్షియల్ వాహనాల అమ్మకాలు 35-45 శాతం క్షీణిస్తాయని తెలిపింది. […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కమర్షియల్ వెహికల్ అమ్మకాలు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సోమవారం తెలిపింది. ఈ-కామర్స్ కార్యకలాపాలు పెరగడంతో లైట్-కమర్షియల్ వాహనాల విభాగం ఇటీవల కోలుకుంటున్న సంకేతాలను చూపిస్తున్నాయి. అదేవిధంగా మీడియం, హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు 2021-22 చివరి త్రైమాసికం వరకు కోలుకునే అవకాశాలు కనిపించడంలేదని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. లైట్-కమర్షియల్ వాహనాల అమ్మకాలు 20-25 శాతం తగ్గుతాయని, మీడియం-కమర్షియల్ వాహనాల అమ్మకాలు 35-45 శాతం క్షీణిస్తాయని తెలిపింది. 2021-22లో పరిశ్రమ రెండంకెల వృద్ధిని చూసే అవకాశముందని ఓ ప్రకటనలో పేర్కొంది.