మహబూబ్‌నగర్‌లో డిస్ ఇన్ఫెక్షన్ ద్రవం పిచికారీ

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వ్యాప్తి నివారణ కోసం మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నింటిపై వైరస్ నివారణ ద్రావణాన్ని పిచికారీ చేయాలని అగ్నిమాపకదళ అధికారులను కలెక్టర్ ఎస్ వెంకటరావు ఆదేశించారు. మంగళవారం బస్టాండ్ ఎదుట గల ప్రధాన రహదారిపై అగ్నిమాపక వాహనంతో డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రే చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఇదే విధంగా స్ప్రే చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కానప్పటికీ, ప్రజలు […]

Update: 2020-05-05 10:16 GMT

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వ్యాప్తి నివారణ కోసం మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నింటిపై వైరస్ నివారణ ద్రావణాన్ని పిచికారీ చేయాలని అగ్నిమాపకదళ అధికారులను కలెక్టర్ ఎస్ వెంకటరావు ఆదేశించారు. మంగళవారం బస్టాండ్ ఎదుట గల ప్రధాన రహదారిపై అగ్నిమాపక వాహనంతో డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రే చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఇదే విధంగా స్ప్రే చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కానప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించడమే కాకుండా మాస్కులను ధరించాలన్నారు. లాక్‌డౌన్ నిబంధనల మేరకు ద్విచక్ర వాహనాలు, కార్లలో పరిమితికి మించి వెళ్లరాదని, ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: disinfectant solution spray, on road, corona restrict, lockdown, fire department

Tags:    

Similar News