కలెక్టర్ ఫేస్‌బుక్ హ్యాక్..ఆపై..!

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు చేలరేగిపోతున్నారు. సోషల్ మీడియా అకౌంట్లు హాక్ చేసి అనేక విధానాల్లో డబ్బులు దోచుకుంటున్నారు. తాజా విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్ ఫేస్‌బుక్ ఖాతాను హాక్ చేసిన సైబర్ నేరగాళ్లు కొంతమంది నుండి డబ్బులు వసూలు చేశారు. కలెక్టర్ అకౌంట్ నుండి కొంత మందికి రిక్వెస్ట్‌లు పెట్టడంతో స్నేహితుడిగా అంగీకరించారు. దీంతో డబ్బులు కావాలని మెసేజ్‌లు పెడుతూ రూ.10 వేలు, రూ.15 వేలు ఇలా డిమాండ్ చేశారు. కలెక్టర్ అడిగాడని […]

Update: 2021-05-04 23:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు చేలరేగిపోతున్నారు. సోషల్ మీడియా అకౌంట్లు హాక్ చేసి అనేక విధానాల్లో డబ్బులు దోచుకుంటున్నారు. తాజా విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్ ఫేస్‌బుక్ ఖాతాను హాక్ చేసిన సైబర్ నేరగాళ్లు కొంతమంది నుండి డబ్బులు వసూలు చేశారు. కలెక్టర్ అకౌంట్ నుండి కొంత మందికి రిక్వెస్ట్‌లు పెట్టడంతో స్నేహితుడిగా అంగీకరించారు. దీంతో డబ్బులు కావాలని మెసేజ్‌లు పెడుతూ రూ.10 వేలు, రూ.15 వేలు ఇలా డిమాండ్ చేశారు.

కలెక్టర్ అడిగాడని కొందరు డబ్బులు పంపి వాపోయారు. మరి కొందరు ఈ తంతంగాన్ని కలెక్టర్‌కు తెలపడంతో.. నేను ఎవ్వరినీ డబ్బులు అడగలేదని.. అది సైబర్ నేరగాళ్ల పనేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి తన ఫేస్‌బుక్ ఖాతాను మూసేసిన కలెక్టర్ హరిజవహార్ లాల్.. నా పేరు చెప్పి డబ్బులు అడిగితే స్పందించవద్దని కోరారు.

Tags:    

Similar News