కోకాకోలా సరస్సు.. ఇందులో ఈత కొట్టొచ్చు.. ఎక్కడ ఉందో తెలుసా?

దిశ,వెబ్‌డెస్క్ : కోకాకోలా.. ఇది మనకు కూల్ డ్రింక్స్‌గానే తెలుసు. రైతులకైతే కోకాకోలా తోటలు తెలుసు. కానీ కోకాకోలా సరస్సు కూడా ఉందని మీకు తెలుసా..? ఈ సరస్సులో ఆటలాడటమే కాదు.. ఈత కొట్టవచ్చు.. రోగాలను తగ్గించే ఔషధంగానూ తాగవచ్చు. ఇది ఎక్కడ ఉన్నదో తెలుసా..? అయితే ఈ కథనం చదవండి.. బ్రెజిల్‌లో కోకా కోలా లేక్ అనే అద్భుతమైన సరస్సు ఉంది. ఇది కోకా కోలా లాంటి నీటితో నిండి ఉండటం వల్ల దీనికి ఆ […]

Update: 2021-11-02 21:35 GMT

దిశ,వెబ్‌డెస్క్ : కోకాకోలా.. ఇది మనకు కూల్ డ్రింక్స్‌గానే తెలుసు. రైతులకైతే కోకాకోలా తోటలు తెలుసు. కానీ కోకాకోలా సరస్సు కూడా ఉందని మీకు తెలుసా..? ఈ సరస్సులో ఆటలాడటమే కాదు.. ఈత కొట్టవచ్చు.. రోగాలను తగ్గించే ఔషధంగానూ తాగవచ్చు. ఇది ఎక్కడ ఉన్నదో తెలుసా..? అయితే ఈ కథనం చదవండి..

బ్రెజిల్‌లో కోకా కోలా లేక్ అనే అద్భుతమైన సరస్సు ఉంది. ఇది కోకా కోలా లాంటి నీటితో నిండి ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ సరస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకప్రాంతాల్లో చూడదగిన పర్యాటక ప్రదేశం. ఈ అందమైన సరస్సు నేల, నీటి భాగం ఖనిజాలతో నిండి ఉందని TOI ఒక నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఈ సరస్సులోని నీరు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపింది. బ్రెజిల్ టూరిజం వెబ్‌సైట్ కోకాకోలా సరస్సు ప్రాముఖ్యత వివరిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఇది ఒక ప్రత్యేకమైన రంగులో ఉన్నప్పటికీ పునరుజ్జీవన లక్షణాలను కలిగి ఉందని పేర్కొంది. ఈ సరస్సును నిజానికి ‘అరరాక్వారా’ అని పిలుస్తారని, అయితే ఇది రంగు నీరు పోలి ఉండడంతో కోకాకోలా సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందిందని వివరించింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు శుభవార్త ఏమిటంటే.. కేవలం దానిని చూసి ఆనందించడమేకాదు.. సరస్సు నీటిలో స్నానం, ఈత లేదా బోటింగ్ చేయవచ్చని తెలిపింది. అయితే ఈ నీరు ఇలా రంగులమయంగా ఉండటానికి ప్రధాన కారణం ఆ నీటిలో ఐరన్ యాక్సైడ్, అయోడిన్ల శాతం ఎక్కువగా ఉండడమేనట. దీని వల్లనే సరస్సులోని నీరు వయోలెట్, పింక్, ఆరెంజ్, రెడ్ కలర్స్ మిక్సింగ్‌లో కనిపిస్తోంది. అక్కడి ప్రజలు ఈ సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని గట్టిగా నమ్ముతారని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఓ లుక్కెయ్యండి.

Tags:    

Similar News