జగిత్యాలకు సీఎం కేసీఆర్.. ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారులు

దిశ, జగిత్యాల: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం ఏ రోజు వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ రాకున్నప్పటికీ టూర్ మాత్రం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మలు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సీఎం పర్యటనలో జిల్లా కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా అధికారులు […]

Update: 2021-12-13 05:57 GMT

దిశ, జగిత్యాల: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం ఏ రోజు వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ రాకున్నప్పటికీ టూర్ మాత్రం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మలు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సీఎం పర్యటనలో జిల్లా కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జగిత్యాల సమీపంలోని మోతే సమీపంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన్నట్టు సమాచారం.

Tags:    

Similar News